Site icon NTV Telugu

IAS Officers Transfers : బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందులో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. అయితే తదుపరి ఉత్త్వులు జారీ చేసేంతవరకూ జవహరర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్‌ఏ‌గా జి. సాయిప్రసాద్ బదిలీ, సాయి ప్రసాద్‌కు రెవెన్యూ భూరికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. జీఎస్ ఆర్కే ఆర్ విజయకుమార్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎక్సైజు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. శశిభూషణ్ కుమార్‌ను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం.. సాధారణ పరిపాలన శాఖ హెచ్ఆర్, సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.

Exit mobile version