Site icon NTV Telugu

రైతులకు శుభవార్త..80 శాతం రాయితీతో విత్తనాలు

శాసనసభలో వరద నష్టంపై ప్రకటన చేశారు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారని తెలిపారు మంత్రి కన్నబాబుజ అలాగే… మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటన చేశారు. భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదలతో 5.33 లక్షల రైతులకు నష్టపోయారని వెల్లడించారు.

నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వద్ద 5 కోట్ల రూపాయల నగదును సిద్దంగా ఉంచామన్నారు. పంట నష్టం కోసం ఎన్యూమరేషన్ మొదలు పెడుతున్నామని… 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సాయం అందించామని.. వరదల కారణంగా పునరావాస క్యాంపుల్లోని వారికి రెండు వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామన్నారు. వ్యవసాయ పంటలు 2.63 హెక్టార్లు, 24 వేల ఉద్యాన పంటలు నీట మునిగిపోయాయని…ప్రాథమికంగా 8 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు తేలిందని ప్రకటించారు. నష్ట వివరాలను సమగ్రంగా తెలుసుకునేందుకు ఎన్యుమరేషన్ చేపడుతున్నామని మంత్రి కన్నబాబు.

Exit mobile version