NTV Telugu Site icon

బ్యాంకులోనే మేనేజర్ రాసలీలలు.. రుణాల కోసం వచ్చిన మహిళలే టార్గెట్..

Podalakur

Podalakur

బ్యాంకుకు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చే మహిళలను లోబర్చుకుంటూ.. ఏకంగా బ్యాంకులోనే రాసలీలలు సాగిస్తున్న బ్యాంకు మేనేజర్ వ్యవహారం సీసీ కెమెరాలకు చిక్కింది… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌ మేనేజర్‌ చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి.. బ్యాంకుకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కామాంధుడు.. లోన్ల కోసం వచ్చేవారిని తన ఛాంబర్‌లోకి పిలిచి సొల్లు కబుర్లు చెబుతుంటాడు.. ఇక, లోన్లు కట్టలేనివారు.. కొత్త లోన్లు కోసం వచ్చిన గృహిణులను టార్గెట్‌గా చేసుకుంటాడు.. వారి ఆర్థిక అవసరాలను ఆసరగా మార్చుకుని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. కొందరు మహిళలపై బ్యాంకు ఆవరణలోనే వికృతచేష్టలకు పాల్పడిన ఘటనలు జరిగాయి..

బ్యాంకుకు వెళ్లే మహిళల వివరాలు, ఫోన్‌ నంబర్లు తీసుకోవడం.. వారిని లోబర్చుకోవడంలో అతడిది అందెవేసిన చేయిగా చెబుతున్నారు. మరికొందరు మహిళలు.. బ్రాంచీ మేనేజర్‌ చేష్టలను ఎవ్వరికీ చెప్పుకోలేక కుంగిపోతున్నారు.. ఒంటరిగా ఉన్న మహిళలు అతడి క్యాబిన్‌లోకి వెళ్లేందుకే వణికిపోతున్నారంటే.. అతగాడి చేష్టలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి కీచకుడు బ్యాంకులో ఉంటే మహిళలకు, బ్యాంకుకు ఎలాంటి రక్షణ ఉంటుందని మహిళలు మండిపడుతున్నారు. అతడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్బీఐ, పొదలకూరు బ్రాంచ్ మేనేజర్‌ వికృత చేష్టలు సీసీ కెమెరాకు చిక్కడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.