రాష్ట్ర వ్యాప్తంగా 435 ఎయిడెడ్ హైస్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారని ఉన్నత విద్యా శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీసతీష్ చంద్ర అన్నారు. అలాంటి స్కూ ళ్లకు ప్రభుత్వం ఎందుకు ఎయిడ్ ఇవ్వాలని ఆయన ప్రశ్నిం చారు. అవసరమైతే ఎయిడెడ్ స్కూళ్ళలోని పిల్లలకు ఇబ్బంది కలుగ కుండా కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని సతీష్ చంద్ర పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అనంతపురం SSBN కాలేజ్ ఘటనపై ఆయన స్పందించారు.
అనంతపురం SSBNలో గాయపడిన విద్యార్థిని తాను బీబీఏ రెండో సంవత్సరం అని స్వయంగా చెప్పారన్నారు. బీబీఏ నాన్ ఎయిడెడ్ కోర్సు అని తెలిపారు.ఎయిడెడ్ అంశం వల్ల ఆమె పై ఎటువంటి ప్రభావం పడదన్నారు. మరి ఈ ఆందోళనలో ఆ విద్యార్థిని ఎందుకు పాల్గొనడం లేదనే అనుమానం ఎవరికైనా కలుగుతుందన్నారు. ప్రభు త్వంపై బురద చల్లడానికే కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సతీష్ చంద్ర అన్నారు.
