టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారువారిపాట ఈ మధ్యే విడుదలైంది.. మంచి వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది.. అయితే, ఈ సినిమాలో.. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చూపించారు.. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు.. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటో ఏపీలో వెలుగు చూసింది.
Read Also: Nara lokesh: ఎమ్మెల్సీ అనంతబాబు కేసు.. సజ్జలపై లోకేష్ తీవ్ర ఆరోపణలు..
చిత్తూరు జిల్లాలో ఫైనాన్స్ వారు ట్రాక్టరు తీసుకెళ్లారని మనస్తాపంతో ట్రాక్టరు యజమాని ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది.. ఇటుకలు తరలించేందుకు ట్రాక్టరు కొన్నాడు చౌడేపల్లెకి చెందిన సుబ్రమణ్యం… అయితే, ఈఎంఐలు సరైన టైంలో కట్టలేదని ట్రాక్టరు సీజ్ చేసింది ఫైనాన్స్ సంస్థ… కరోనా మహమ్మారి విజృంభనతో వ్యాపారులు లేవని, నెలరోజుల సమయం అడిగినా అధికారులు పట్టించుకోలేదని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుల వేధింపుల వల్లే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.