Site icon NTV Telugu

Special Trains: ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్.. సంక్రాంతికి భారీగా ప్రత్యేక రైళ్లు

Untitled Design (13)

Untitled Design (13)

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్ధీ పెరుగుతుండడంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడు సంక్రాంతికి ఎంతో మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. వారి కోసమే రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించింది. దానితో పాటు తాజాగా మరో 41 స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ స్పెషల్ ట్రైన్స్ జనవరి 8 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 14వ తేదీ నుంచే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగానే టికెట్ లు బుక్ చేసుకోవడం చాలా మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version