RadhaKrishna Art: కొందరు కళాకారుల ప్రతిభ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేం. కళాకారుల్లో కొంతమంది పెయింట్ ఆర్ట్‌తో మెస్మరైజ్ చేస్తే మరికొందరు మాత్రం శాండ్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఉప్పుతో ఆర్ట్ వేసి అందరి హృదయాలను దోచుకుంటారు. అలాంటి ఓ కళాకారుడు చిత్తూరు జిల్లాలో మనకు కనిపిస్తాడు. కుప్పంలోని పూరి ఆర్ట్స్ కళాకారుడు పురుషోత్తం ఇదే కోవలోకి వస్తాడు. శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో పురుషోత్తం ఉప్పుతో రాధాకృష్ణుల చిత్రాలు వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. విభిన్న రంగులతో రాధాకృష్ణుల చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. దీంతో పురుషోత్తం ఆర్ట్ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ పలువురు దేశ ప్రముఖుల చిత్రాలను పురుషోత్తం సాల్ట్‌తో చిత్రీకరించి అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు.
Read Also: Noida Twin Towers: 40 అంతస్తులు 35 క్వింటాళ్ల పేలుడు పదార్థాలు.. భవనం కూల్చేందుకు రంగం సిద్ధం