రేపు జగన్ 49వ పుట్టిన రోజును పురస్కరించుకుని పాటల విడుదల చేయనున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి. రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు కార్యకర్తలు, నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపొందించనున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాటల వీడియో విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, ఇతర నేతలు విడుదల చేశారు.
పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి: సజ్జల
మేమందరం అనుకున్న మాటలనే పాటకు రూపం ఇచ్చారు. దీర్ఘకాలంలో పేద ప్రజల జీవితాలను మార్చే విధంగా జగన్ పరిపాలన కొనసాగించడంతో పాటు ప్రజలకు ఆనందకరమైన జీవితాలను అందిస్తున్నారు. ప్రజల్లో ఉన్న రూపాన్ని గ్రీన్ ఆర్ట్‌లో చక్కగా రూపొందించారు. అందరి తరపున జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి ఒక్కరూ రేపు మొక్కలు నాటాలని సజ్జల పిలుపునిచ్చారు.
