Site icon NTV Telugu

ఆత్మకూరు ప్రజల దాహార్తి తీరుస్తాం-మంత్రి మేకపాటి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. తొలుత అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ‘ఎంజీఆర్ స్వజల్’ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ని విద్యుత్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇళ్ళకు నేరుగా నీరు అందించే కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గంలో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అందుకు సహకరించిన ఆదానీ గ్రూప్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్నానది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికీ తక్కువ ధరకే రక్షిత మంచినీరు అందించనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఆర్టీవో చైత్ర వర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అదానీ ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి, ఐఐటీ ఖరగ్‌ పూర్ ఇంజినీర్ బ్రహ్మానందం పాల్గొన్నారు.

Exit mobile version