Site icon NTV Telugu

RTC MD Dwarakatirumala Rao: ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి

ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. ఎంత మేర ప్రభుత్వానికి ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తాం. గతంలో ఆర్టీసీ బల్క్ కింద డీజిల్ కొనడం వల్ల రిటైల్ కంటే తక్కువగా ధరకు లభ్యమయ్యేది. టెండర్ల ద్వారా ఇంధన తయారీ సంస్థల నుంచి మూడేళ్లకోసారి టెండర్లు వేసి కొంటున్నాం అన్నారు.

ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్లు డీజిల్ ను కొంటుంది. మార్చి 1నుంచి కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ నుంచి బల్క్ వినియోగదారుల రేట్లు పెరుగుతున్నాయి. రిటైల్ కంటే బల్క్ గా కొంటే డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి1 న రిటైల్ గా డీజిల్ రూ. 96.02 ఉంటే బల్క్ గా రూ. 96.24కు పెరిగింది. ఫిబ్రవరి 15 నాటికి రిటైల్ గా 96.02 ఉంటే బల్క్ ఇంధనం ధర 100.41 పైసలు ఉంది. రిటైల్ కంటే రూ. 4.39 లీటరుకు ఎక్కువగా మాకు డీజిల్ ధర పెరిగింది.

ఆర్టీసీకి రోజుకు రూ. 32 లక్షలు అదనంగా ఖర్చు అవుతోంది. ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో మాకు రిటైల్ పెట్రోల్ బంకులున్నాయి.రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. అన్ని చోట్లా రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. బల్క్ రేట్లు తగ్గినపుడు ఆయిల్ తయారీ సంస్థల నుంచి తిరిగి కొంటాం అన్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు.

2013లోనూ ఇలాంటి సమస్యే ఎదురుకావడంతో అప్పట్లో ఇలాగే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలోనూ బయట పెట్రోల్ బంకుల నుంచి రిటైలుగా ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో 100 ఎలక్ట్రిటిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతాం. ఇలా మార్చడం వల్ల బస్సుకు 60 లక్షలు ఖర్చవుతాయి. కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తాం. పెండింగులో ఉన్న 2015-2019 వరకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విలేజ్ వార్డు సెక్రటేరియట్ ,ఆర్టీసీ లోని ఖాళీల్లో భర్తీ చేస్తాం.

రెండింటిలోనూ అర్హత లేని వారికి కలెక్టర్ ద్వారా భర్తీ చేస్తాం. కారుణ్య నియామకాలపై ఎవరూ కంగారు పడవద్దని కోరుతున్నాం. 1500 మందికి కారుణ్య నియామకాలకింద ఉద్యోగాలిస్తాం. వీలైనంత త్వరలో నియామకాలు పూర్తి చేస్తాం. విలీనం తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు వుంటాయన్నారు ద్వారకా తిరుమల రావు. విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ వారి పిల్లలకు మేనిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తాం.బల్క్ ధరలు తగ్గాక ప్రభుత్వ వాహనాలకూ త్వరలో ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయబోతున్నామన్నారు.

ఆర్టీసీ విలీనం అనంతరం సంస్థ నష్టాలు తగ్గుతున్నాయి. కోవిడ్ ముందు కార్గో ద్వారా ఏటా రూ. 97.44 కోట్లు ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు 18 వేలు పార్సిళ్లు ఉండగా 22 వేల పైగా పార్సిళ్లు పెరిగాయి. సీసీఎస్ కు ఉన్న రూ. 269 కోట్లు అప్పు తీర్చేశాం. పీఎఫ్ లోని అప్పు రూ. 640 కోట్లు తీర్చాం. కోవిడ్ మూడు నెలలుగా సంస్థ పరిస్థితి మెరుగు పడుతోంది. డీజిల్ ధరలు పెరిగినా టికెట్ ధరలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులోని సమస్యలను పరిష్కరిస్తున్నాం.

https://ntvtelugu.com/ap-high-court-fired-on-ttd-board-members/

ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగులు అందోళన ,హడావుడి పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఒక్కొక్కటిగా సమస్యలు పరుష్కరిస్తున్నాం.ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు ఎండీ ద్వారకా తిరుమలరావు.

Exit mobile version