NTV Telugu Site icon

పుష్కరఘాట్‌లో రోశయ్య అస్తికల నిమజ్జనం

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అస్తికత నిమజ్జనం రాజమండ్రి పుష్కరఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు రోశయ్య కుటుంబ సభ్యులు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

ముందుగా హైదరాబాద్ నుండి మధురపూడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రోశయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడిరాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శీఘ్రకోళ్లపు
శివరామ సుబ్రహ్మణ్యం సాదర స్వాగతం పలికారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్య సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు మాజీ గవర్నర్ గా కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య విశేష సేవలందించారు. రోశయ్య వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకం. రోశయ్య సుదీర్ఘకాలంపాటు రాజకీయాలలో ఉన్నారు. ఎవరికైనా కష్టం ఉందంటే రోశయ్య దగ్గరికి వెళితే సమస్యకు పరిష్కారం అవుతుందని అందరికీ బలమైన నమ్మకం వుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయనది ఒక చెరగని ముద్ర అన్నారు.