Site icon NTV Telugu

Minister Savitha: అసెంబ్లీ సాక్షిగా తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని రోజానే చెప్పింది..

Savitha

Savitha

Minister Savitha: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం డీఎస్సీ పైనే చేశారు అని మంత్రి సవిత తెలిపింది. గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా నిర్వహించింది కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.. బీసీల పక్షపాతిగా చంద్రబాబుకు పేరుంది.. బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక డీఎస్సీ కోచింగ్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అందించాం.. 1,670 మంది విద్యార్థులు ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకోగా, 4 వేలకు పైగా ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్నారని పేర్కొనింది. వీరిలో 241 మంది విద్యార్థులు డీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు.. గ్రూప్-2 మెయిన్స్‌లో కూడా కొంతమంది విజయాన్ని సాధించారు.. ఇకపై కూడా బీసీ స్టడీ సర్కిల్‌ను బలోపేతం చేస్తామని మంత్రి సవిత వెల్లడించింది.

Read Also: Dibang Project : చైనా వాటర్ బాంబ్‌పై భారత్ ఆటమ్ బాంబ్!

అయితే, వైసీపీ నా ఫోటోను మార్ఫింగ్ చేసి చూపిస్తోందని మంత్రి సవిత ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసం సవిత మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తోందని రోజా ఆరోపించారని చెప్పుకొచ్చింది. అసభ్యకరంగా మాట్లాడడం మాకు చంద్రబాబు నేర్పించలేదన్నారు ఆమె. ఇక, నేను తిరుపతి లెటర్స్ అమ్ముకోలేదన్నారు. పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు ఎంతమందికి టీటీడీ దర్శనాలు చేయించానో వచ్చి చూసుకోండి అని సవాల్ విసిరింది. ఇక, రోజా టూరిజం శాఖ అభివృద్ధి కోసం ఏమి చేశారు అని ప్రశ్నించింది.. నగరిలో రోజా ఎన్ని దర్శనాలు చేయించారు? ఒకరు జబర్దస్త్ షో చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటారు. మరొకరు బెంగళూరులో ఉంటారు అని సవిత పేర్కొనింది.

Read Also: Vasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు..

ఇక, అమరావతి, యూరియా, వివేకా హత్య కేసు ఏదైపైనా వచ్చిన తాను చర్చకు సిద్ధమేనని మంత్రి సవిత తెలిపింది. మేము హాఫ్ నాలెడ్జ్ అయితే, మీ ఫుల్ నాలెడ్జ్‌తో ఏమి చేశారు? అని ప్రశ్నించింది. అసెంబ్లీ సాక్షిగా రోజా మాట్లాడుతూ, తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పిన వ్యా్ఖ్యలను గుర్తు చేసింది. గతంలో మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు మాట మార్చారు.. ఇవాళ మళ్లీ అమరావతి డ్రామా మొదలు పెట్టారన్నారు. అయితే, పులివెందుల ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపించాలని ఆమె డిమాండ్ చేసింది. మేము అసభ్యకరంగా మాట్లాడం, మీ ప్రశ్నలకు అసెంబ్లీలోనే జవాబిస్తామన్నారు. రోజా, విడుదల రజనీ టీడీపీ మొక్కలే అని మంత్రి సవిత గుర్తు చేసింది.

Exit mobile version