Site icon NTV Telugu

Roja Reaction Jr NTR Row: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆర్కే రోజా హాట్ కామెంట్స్!

Roja

Roja

Roja Reaction Jr NTR Row: జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తామని చెప్పడం, సూర్యుడ్ని అరచేతితో ఆపుతామన్నట్టే హాస్యాస్పదంగా ఉందన్నారు. సినిమా బాగుంటే చూస్తారు.. లేకపోతే చూడరు.. హరిహర వీరమల్లు సినిమాకు ఎమ్మెల్యేలు టికెట్లు ఫ్రీగా ఇచ్చానా అభిమానులు చూడలేదు‌ అని సెటైర్లు వేసింది‌‌. రాజకీయం రాజకీయాంగా చూడండి‌.. సినిమాను సినిమా వాళ్ళ చూసుకుంటారు అని చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ ను తిడితే గేమ్ ఛేంజర్, హరిహర వీరామల్లు సినిమాలు ఎలా ప్లాప్ అయ్యాయో చూశాం.. కాబట్టి, సినిమాలను- రాజకీయాలను కలపకండి అని ఆర్కే రోజా తెలిపింది.

Read Also: Aryan Khan : డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ ఖాన్ టీజర్ చూశారా?

ఇక, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడు.. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అని మాజీమంత్రి రోజా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమా ఆడుతున్నాయి‌.. టీడీపీ నేతల మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారు.. అయితే, స్ర్తీశక్తి కాదు అది స్ర్తీ దగ చేసే పథకం అని ప్రభుత్వంపై మండిపడింది. 16 రకాల బస్సులు ఉంటే ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు.. బస్సుల్లో లోకల్ గా మాత్రమే తిరగాలి‌.. రాష్ట్రం మొత్తం ఉచితంగా కాదు.. ఆలయాలు అన్ని చూడవచ్చు అని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని ఆరోపించింది. ఇన్ని మోసాలు జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఫ్రీ బస్సు లేదు.. వైఎస్ జగన్ అన్న నెలనెలా పథకాలతో డబ్బులు నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేశారు. ఇక, మహిళలను మోసం చేసి బాగు పడినా ముఖ్యమంత్రి లేరని రోజా విమర్శించింది.

Exit mobile version