Site icon NTV Telugu

ఏపీలో దీపావళి సంబరాలపై ఆంక్షలు

ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు విధించారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా గ్రీన్‌ క్రాకర్స్‌‌ మాత్రమే కాల్చి… పండుగ జరుపుకోవాలని కోరింది. శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు కూడా ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు.

Exit mobile version