Site icon NTV Telugu

కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ…

కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో… అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతాం అని జేఏసీ పేర్కొంది. రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తాం అని జేఏసీ హెచ్చరించింది. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అన్ని పేర్కొన జేఏసీ రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయాలి అని స్పష్టం చేసింది.

Exit mobile version