నేడు రాజ్ భవన్ ను ముట్టడించేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు. ఛలో రాజ్ భవన్ నిరసనకు రాయలసీమ జిల్లాలనుంచి విద్యార్ధులు తరలివస్తున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం అంటూ సీపీ హెచ్చరించారు.
విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్యర్యంలో నిరసనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూల్ రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అనంద్ రావు నీ రీకాల్ చేయాలని, 153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 13 మంది విద్యార్థుల పై పెట్టిన అక్రమ సస్పెన్షన్, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు.
అంతేకాకుండా యూనివర్శిటీలో ఉద్యోగాలు పొందిన అక్రమ ప్రొఫెసర్లను ఉన్నత పదవుల నుండి తొలగించాలి. నిర్మాణం పూర్తి అయిన నూతన భవనాలను ప్రారంభించాలి. డిగ్రీ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి. పరీక్షా విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఘోట్ల గోరంగా వ్యవహరిస్తున్న BMS సెక్యురిటి ఏజెన్సీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు. ఆందోళన నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలను రెండు రోజులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Sangam Dairy: జీడీసీసీ అక్రమాలపై కలెక్టర్ కు ధూళిపాళ్ళ ఫిర్యాదు
