Site icon NTV Telugu

సీఎం జగన్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్.. జైల్లో అలా ఉండి

ram gopal varma-jagan

ram gopal varma-jagan

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది దాచుకోడు. మంచైనా .. చెడైనా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతాడు. ఆయనకు ఓ పట్టనా మనుషులు నచ్చరు.. ఇక రాజకీయాల పరంగా అయితే టీడీపీని , జనసేనను ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ ఎప్పుడు, ఎక్కడ ఏపీ సీఎం జగన్ ని విమర్శించడం కానీ, కామెడీ చేయడం కానీ, కౌంటర్లు వేయడం కానీ చేయలేదు. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఓపెన్ అయ్యాడు.

ఎందుకు మీరు జగన్‌పై కామెడీ చేయరు అనేదానిమీద ఆయన మాట్లాడుతూ ” నేను అభిమానించే నాయకుల్లో జగన్ ఒకరు.. అతనిని నేను చాలా దగ్గరగా చూశాను.. జైల్లో ఉన్నప్పుడు చాలా సార్లు అతనిని నేను పరిశీలించాను..జైల్లో ఉన్నప్పుడు కానీ, తండ్రి మృతి చెందినప్పుడు కానీ, ఒంటరిగా పోరాటం చేసినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు.. దైర్యంగా నిలబడ్డాడు. అందుకే ఆయన నాకు నచ్చుతాడు.. టీడీపీ హయాంలో కూడా జగన్ తొణకలేదు.. ఎవరు తోడుగా లేకపోయినా ఒక్కడే నిలబడ్డాడు.. ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదు.. వీటి కారణంగానే ఆయనపై ఎప్పుడు కామెడీ చేయాలనిపించదు.. కౌంటర్లు వేయాలనిపించదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ రాజకీయ నేపథ్యంలో ‘కొండా’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version