NTV Telugu Site icon

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకి ఊరట.. షరతులతో విడుదలకి గ్రీన్ సిగ్నల్

Anantha Babu Release

Anantha Babu Release

Rajamundry SC ST Atrocity Court Put Conditions For MLC Anantha Babu Release: మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై.. అతని విడుదలకు మార్గం సుగుమం అయ్యింది. సుప్రీం ఆదేశాల మేరకు.. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ. 50 వేలు వంతున ఇద్దరు వ్యక్తులు పూచీకత్తులు పెట్టాలని ఆదేశించారు. సాక్షులతో మాట్లాడటం గానీ, వారిని బెదిరించడం గానీ చేయకూడదని హెచ్చరించారు. పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు.. విదేశాలకు వెళ్లకూడదని షరతు విధించారు. ఇలా షరతులతో కూడిన బెయిల్ మంజూరవ్వడంతో.. ఈరోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అనంతబాబు విడుదల కానున్నారు.

Sajjala Ramakrishna Reddy: 24 వేల కోట్లకు కేబినెట్ ఆమోద ముద్ర.. చంద్రబాబుకి కడుపు మంట

కాగా.. తన వద్ద డ్రైవర్‌గా ఐదేళ్లకు పైగా పని చేసిన సుబ్రమణ్యంను, ఓరోజు మాట్లాడాలనుందని అనంతబాబు తీసుకెళ్లారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో.. డ్రైవర్‌పై దాడి చేసి, హత్య చేశారు. అనంతరం తానే స్వయంగా తన కారులో సుబ్రమణ్యం డెడ్ బాడీని అతని ఇంటి వద్ద వదిలేశారు. అక్కడ కుటుంబ సభ్యులకు తనతో వాగ్వాదానికి దిగడంతో, తన కారుని అక్కడే వదిలేసి అనంతబాబు వెళ్లిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి, విచారణ చేపట్టి, అనంతబాబుని రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 23వ తేదీ నుంచి ఇప్పటిదాకా ఆయన రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. అనంతబాబు బెయిల్ కోసం పలుసార్లు పిటిషన్ దాఖలు చేయగా.. అవి తిరస్కరణకు గురయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. ఆయన విడుదలకు మార్గం సుగుమం అయ్యింది.

Uber and Ola surge prices?: సడన్‌గా ఛార్జీలు పెంచుతోన్న క్యాబ్‌ కంపెనీలు..! ఇలా చేస్తే బెటర్..