ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం.. అత్యంత తీవ్ర తుఫాన్ ‘తౌక్టే’ గడచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో ‘అతి తీవ్ర తుఫానుగాస మారిందని.. అమ్రేలికి తూర్పు దిశగా 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. రాగల 3గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫాన్‌గా.. ఈరోజు సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది.. ఇక, ఈ నెల 21వ తేదీన నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉందని.. 23వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
వీటి ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ కేంద్రం.. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇక, ఈ రోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు.. ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.