తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను కలవరానికి గురిచేశాయి.. అయితే, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుంది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశమున్నందున నేటి నుంచి 17వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరో అల్పపీడనం.. ఇవాళ్టి నుంచే వర్షాలు..
Rains