ఏపీలో రాబోయే రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక రాయలసీమలో కూడా మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ. ఇది ఇలా ఉండగా.. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో కుండపోత వాన కురిసింది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అలర్ట్ : మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన

rain