NTV Telugu Site icon

Viral Video: కాకినాడలో రైలు కింద పడిన ప్రయాణికుడు.. కాపాడిన ఎస్సై

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే ఎస్సై వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… కాకినాడ రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్‌ఫారంపైకి కాకినాడ-తిరుపతి రేణిగుంట ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైలు వెళ్ళిపోతున్న సమయంలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైయిన్ కావడంతో పొరపాటున కాలు జారింది. ప్రయాణికులు రైలు, ప్లాట్‌ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు అతడిని చాలా దూరం పాటు ఈడ్చుకెళ్లింది.

అయితే ప్రయాణికుడిని వెంటనే గమనించిన రైల్వే ఎస్సై రామారావు పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని గట్టిగా లాగారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, చాకచక్యంగా బయటకు లాగి కాపాడారు. ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు రైలులోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు కూడా ఆగింది. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే ఎస్సై, సిబ్బందిని అందరూ అభినందించారు. కాగా ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://ntvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Video-2022-02-19-at-3.29.33-PM.mp4