ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఏపీ సీనియర్ నేతలతో స్వయంగా మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే 15 రోజులలో సీనియర్ నాయకులందరినీ ఢిల్లీ కి రావాలని పిలుపునిచ్చారు. విడివిడిగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితో రాహుల్ సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్ర సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ పై నిర్ణయం తీసుకోనుంది. సుమారు 20 మంది సీనియర్ నాయకుల జాబితాను సిధ్ధం చేసారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండి. డా. కే. వి. పి. రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, డా. చింతా మోహన్, టి. సుబ్బరామి రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు తదితరులు జాబితాలో ఉన్నట్లు సమాచారం.
ఆగస్టు మొదటి వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది సంప్రదింపుల ప్రక్రియ. రెండు రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉమన్ చాండి, ఇంచార్జ్ ఏఐసిసి సెక్రటరీలు క్రిస్టొఫర్, మయప్పన్ లతో గంటన్నర పాటు చర్చలు జరిపారు రాహుల్ గాంధీ. ఏపీ కాంగ్రెస్ పరిస్థితి పై సమగ్ర నివేదికను అందజేశారు. ఉమన్ చాండి. కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలకు జాతీయస్థాయులో బాధ్యతలు అప్పగించనున్నారు పార్టీ అధిష్ఠానం.ఆగస్టు నెలాఖరు వరకు పీసీసీతో సహా అనేక ఇతర అంశాలపై సంప్రదింపుల ప్రక్రియ ను పూర్తి చేసి తగు నిర్ణయాలు తీసుకోనుంది పార్టీ అధిష్ఠానం.
