NTV Telugu Site icon

ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ దృష్టి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి.  2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది.  తెలంగాణ ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్ర‌జ‌లు కోపంగా ఉన్నారు.  ఆ కోపాన్ని ఎన్నిక‌ల్లో చూపించారు.  అయితే, ఈ సంఘ‌ట‌న‌లు జరిగి ఏడేళ్లు గ‌డిచింది.  అయిన‌ప్ప‌టికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేక‌పోతున్న‌ది.  పార్టీని తిరిగి బ‌లోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్ప‌టికైనా ఏపీలో అధికారంలోకి వ‌చ్చే అవకాశం ఉంటుంది అన్న‌ది ఆ పార్టీ వాద‌న‌.  అందుకోస‌మే పార్టీని బ‌లోపేతం చేసేందుకు సుమాలోచ‌న‌లు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న సీనియ‌ర్ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు.  ఈ స‌మావేశంలో ఏపీ కాంగ్రెస్ పై ప‌లు నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  పీసీసీ అధ్య‌క్షుడిని మారుస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  ఒక‌వేళ పీసీసీ అధ్య‌క్షుడి మార్పు ఉంటే ఎవ‌రికి ఇస్తారు అన్న‌ది ఈ స‌మావేశం త‌రువాత క్లారిటీ వ‌స్తుంది.  

Read: ఆ పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు… ఎక్క‌డో తెలుసా…!!