రఘురామ కృష్ణ రాజు బెయుల్ పిటీషన్ సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రఘురామ కృష్ణ రాజు దాఖలు చేసిన ఎస్.ఎల్.పి తో పాటు, ఆయన కుమారుడు దాఖలు చేసిన మరో పిటీషన్ కూడా సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుంది. బెయుల్ పిటీషన్ ను హైకోర్టు సింగిల్ జడ్జ్ తిరస్కరించాడన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో రఘురామ కృష్ణ రాజు పిటీషన్ వేశారు. శనివారం నాడు సి.ఐ.డి కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆర్డర్ ను, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తాత్కాలిక ఉత్తరువులను కూడా సవాల్ చేస్తూ రఘురామ కృష్ణ రాజు కుమారుడు కె.భరత్ మరో పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈరోజు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బి.ఆర్. గవై లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఈ పిటీషన్ వాదనలు జరగనున్నాయి.