ఐఏఎస్ ను అంటూ బురిడీ కొట్టించాడు..జాయింట్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించాడు..నేమ్ ప్లేట్ రెడీ చేసుకున్నాడు..సైరన్ పెట్టుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి ముందుగా డ్రైవర్ ,పీఏను నమ్మించి వేతనాలు పెంచాడు…అలా నమ్మించి ఒక్కటి కాదు రెండు ఏకంగా 80 లక్షలు వసూలు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాదితులు స్టేషన్ మెట్లెక్కితే సూడో ఐఏఎస్ అని తేల్చిన ఖాకీలు అసలు బాగోతం బయటపెట్టారు.
బర్ల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు..ఈ క్రమంలో తన గ్రామంలో రైల్వేలో జాబ్ వచ్చిందని చెప్పడంతో గ్రామస్తులు అంతా నమ్మి అతనికి సన్మానం చేశారు..అంతటితో ఆగకుండా అమ్మానాన్నల వద్ద లక్షల రూపాయలు తీసుకుని ఏకంగా కారు కొన్నాడు..ఆ తర్వాత దానికి డ్రైవర్ ను పెట్టుకున్నాడు..సివిల్స్ రాసి ఐఏఎస్ అయ్యాయని మరోసారి నమ్మించాడు..మకాం మంచిర్యాలకు మార్చి పెద్ద అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. ఐఏఎస్ కదా అని పీఏ,డ్రైవర్ ను నమ్మించి వారి బంధువుల వద్ద ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఏకంగా 29 మంది వద్ద 80 లక్షలు వసూలు చేశాడని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఏకంగా నేమ్ ప్లేట్ రాయించుకోవడం తో పాటు తనకున్న కారుకు సైరన్ పెట్టించుకున్నాడు…ఎందుకో అనుమానం వచ్చిన మంచిర్యాల కు చెందిన ఇద్దరు బాదితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన మంచిర్యాల టౌన్ పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేక్ ఐఏఎస్ అని తేల్చారు..ఏకంగా కలెక్టర్ తరహాలో ఉండడం కోసం వేసుకునే కోటు (డ్రెస్ ),అలాగే డ్రైవర్ కు సైతం ఓ డ్రస్ ,పచ్చ పెన్ను సంతకాలు, నేమ్ ప్లేట్ తో అందరిని బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు..కాగా నిందితుడు లక్ష్మీనారాయణ నుంచి ఎంజీ హెర్టిగా ,నెక్సాన్ అనే రెండు కార్లు ,రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ,బాధితుల సర్టిఫికెట్స్ ,డ్రెస్ ,కలెక్టర్ లక్ష్మీనారాయణ అనే నేమ్ ప్లేట్ ,డ్రైవర్ డ్రస్, 7రిజిస్టర్స్ తో పాటు రెండు లక్షల 50 వేల నగదు సీజ్ చేసుకున్నారు పోలీసులు.
పీజీలు చదివిన వారంతా దాదాపు 29 మంది సర్ఠిఫెకెట్లు ఇవ్వడమే కాదు ఒక్కోక్కరు 3 నుంచి ఐదు లక్షల వరకు నకిలీ ఐఏఎస్ కు ఇచ్చారు..దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు..ఉన్నత చదువులు చదివి ఇలాంటి మోసగాళ్ల వలలో పడటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి..సర్కార్ కొలువు వస్తుందని గుడ్డిగా ఇలా నమ్మితే మోసపోవడం ఈజీ. సో సర్కార్ ఉద్యోగాలు సంతకాలతో … కాసులిస్తే వచ్చేవి కావు…కష్టపడి చదవితే వస్తాయి..మరి ఇంత ఈజీగా కొలువులు వస్తాయని ఎవరైనా చెప్తే నమ్మి మోసపోకండి..