పీఆర్సీపై కసరత్తు పూర్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా పీఆర్సీ వ్యవహారం హట్‌టాపిక్‌గా నడుస్తోంది… అయితే, తాజా సమాచారం ప్రకారం.. పీఆర్సీపై ప్రభుత్వ కరసరత్తు దాదాపుగా పూర్తిఅయ్యింది.. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని క్రోడీకరించి నోట్ సిద్ధం చేసింది సీఎస్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ.. ఈ సాయంత్రం ఆ రిపోర్ట్ ను సీఎస్ సమీర్ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక, ఉద్యోగ సంఘాలకు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వనున్నారు సీఎస్… అనంతరం పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉండగా.. ఆ తర్వాతే పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు..
కాగా, పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఆర్థిక పరిస్ధితి దృష్ట్యా.. ఎంత మేర ఫిట్మెంట్ ఇచ్చేందుకు సాధ్యమవుతుందనే విషయమై సమాలోచనలు చేశారు.. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం మధ్యంతర బృతి ఇస్తుండగా.. ఆపై ఎంత మేర ఫిట్మెంట్ పెంచితే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారులను సీఎం నివేదిక అడిగారు. ఇక, సీపీఎస్ రద్దు చేస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుంది.. ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది, ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సిద్ధం చేసినట్టుగా సమాచారం.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Tags
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!