NTV Telugu Site icon

Ram Gopal Varma: రేపు పోలీసు విచారణకు రాంగోపాల్‌ వర్మ.. వస్తాడా..?

Rgv

Rgv

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ రేపు పోలీసు విచారణకు హాజరుకాబోతున్నారు.. రేపు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఆర్జీవీ.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గత నవంబర్‌లో రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదైంది.. అయితే, కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆర్జీవీ.. ముందస్తు బెయిల్ పొందారు.. అయితే, ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు వర్మ.. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి.. తాజాగా జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ.. రేపు విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారట.. అయితే, రేపైనా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. పోలీసుల విచారణకు హాజరవుతారా? లేదా.. ఇంకా ఏదైనా కారణం చూపి.. చివరి నిమిషంలో డుమ్మా కొడతారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..

Read Also: Zomato: జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఇదే..