Site icon NTV Telugu

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు

Earthquakebihar

Earthquakebihar

Earthquake: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూప్రకంపలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జిల్లాలోని పలుచోట్ల ఈ రోజు స్వల్పంగా భూమి కంపించింది.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో సెకను పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, భూప్రకంపన సమయంలో పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. పెద్ద శబ్దాలతో భూమి కంపించటంతో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు..

Read Also: Sujana Chowdary: సుజనా చౌదరికి తీవ్ర గాయం.. లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలింపు

కాగా, సోమవారం రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించిన విషయం విదితమే.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో సోమవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసినట్టు స్థానికులు వెల్లడించారు.. అయితే, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం కాస్త తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.. కాగా, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు టెన్షన్‌ పెట్టిన విషయం విదితమే..

Exit mobile version