Minister Anitha: అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక.. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు.. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు.. ప్రతిపక్ష హోదా చాక్లెటో, బిస్కెటో కాదు అని మంత్రి అనిత పేర్కొనింది.
Read Also: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు బెనిఫిట్?
ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబుని అవమానిస్తే ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారు అని వంగలపూడి అనిత గుర్తు చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి పోరాటం చేశారు.. జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలి కదా అని సూచించింది. జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగలేదు.. 11 మంది రాజీనామా చేసి వెళ్తే నష్టమేమీ లేదు.. ఉప ఎన్నికల్లో ఉన్నవాళ్లు కూడా ఓడిపోతారని చెప్పుకొచ్చింది. ఇక, లిక్కర్ స్కామ్ పై విచారణ జరుగుతుంది.. విచారణ పూర్తైన తర్వాత లిక్కర్ స్కామ్ పై మాట్లాడుతామని మంత్రి వంగలపూడి అనిత వెల్లడించింది.
