సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడ్డారు. సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. అలల తీవ్రతను అంచనా వేయని వీళ్లు.. ఐదుగురు కెరటాలకు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందినవారిగా గుర్తించారు. కాగా.. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు మాధవ, జెస్సికా, యామినిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tragedy: ప్రకాశం జిల్లాలో విషాదం.. పాకల బీచ్‌లో ఐదుగురు గల్లంతు
- ప్రకాశం జిల్లాలో విషాదం
- పాకల బీచ్‌లో ఐదుగురు గల్లంతు
- ముగ్గురు మృతి.. ఇద్దరిని కాపాడిన మత్స్యకారులు.
Show comments