Site icon NTV Telugu

శ్రీశైలం : ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌ ఇన్‌ ఫ్లో 28,377 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 23,626 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.90 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 154.1806 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.. మరోవైపు.. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో డ్యామ్‌కు వరద పెరిగే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version