Site icon NTV Telugu

Andhra Pradesh: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరు

Machilipatnam Port

Machilipatnam Port

Andhra Pradesh: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ మేరకు పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరైంది. దీంతో పోర్టు వ్యయానికి అవసరం అయ్యే 100 శాతం రుణాన్ని పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం మంజూరు ఉత్తర్వులు పంపిందని తెలిపారు. రుణం మంజూరు కావడంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు.

Read Also: Sandhya Devanathan: మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

కాగా ఏపీలో మేజర్ ప్రాజెక్టు అయిన మచిలీపట్నం పోర్టుకు ఇటీవల హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు త్వరలోనే మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. కాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయాలంటే ముందస్తుగా జాతీయ రహదారులు, రైలు మార్గాలను కలుపుతూ రోడ్డు కం రైలు మార్గాల నిర్మాణం కోసం భూసేకరణ, నిధులు విడుదల చేయాల్సి ఉందని ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ మేరకు పోర్టు కనెక్టివిటీ కోసం, రోడ్‌ కం రైలు మార్గాల కోసం ఎంతభూమి సేకరించాలి? రైతులకు ఎంతమేర పరిహారంగా ఇవ్వాలి? తదితర వివరాలను రాష్ట్ర ఆర్‌అండ్‌బీ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version