NTV Telugu Site icon

Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్

Hawala Mony

Hawala Mony

Anantapur Police: హవాలా మార్గంలో నగదును తరలిస్తున్నకేరళ దోపిడీ గ్యాంగ్ కు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు కల్లుగప్పి హవాలా డబ్బును తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ.1.89 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో నలుగురితో పాటు, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read also: Traffic pending challans: ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు.. మీర్ చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ పై చర్యలు?

రాప్తాడు హైవేపై ఓ వాహనం వెలుతుండగా అనంతపురం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన పోలీసులకు ఆ వాహనాన్ని చెక్‌ చేయగా.. షాక్‌ కు గురయ్యారు. అందులో డబ్బులు కుప్పలుగా ఉండటం చూసి వాహనంలో వున్న వారిని ప్రశ్నించడంతో వారు సమాధానం చేప్పేందుకు తడపడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డబ్బుపై సరైన ఆధారలు చూపించాలని కోరాగా.. లేవు అనడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో.. కేరళ గ్యాంగ్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వంలో హవాళా డబ్బు ను దోపిడీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నిందితులను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇది మొదటిసారా? లేక ఇంతకుముందే ఇలాంటి జరిగాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. వీరితో ఎవరైనా కుమ్మక్కై హవానా డబ్బును తరలిస్తున్నారా? అనేకోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు