Site icon NTV Telugu

రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. అనేక అంశాలపై స్పందించారు.. ఇక, రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.. మరోవైపు.. రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించిన మోడీ… అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరికాదన్నారు.. తలుపులు మూసి పేపర్ స్ప్రే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు.. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: ఈడీ దృష్టికి గుడివాడ కేసినో వ్యవహారం..

కాగా, యూపీఏ 2 ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ.. కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు..

Exit mobile version