NTV Telugu Site icon

PM Modi Vizag Tour Live Updates: ప్రధాని నరేంద్రమోడీ వైజాగ్ పర్యటన.. లైవ్ అప్ డేట్స్

93300400 7b39 496f A169 D769ee2dc6a0

93300400 7b39 496f A169 D769ee2dc6a0

ప్రధాని నరేంద్ర మోడీ సభకు సాగరతీరం విశాఖనగరం సర్వం సిద్ధమైంది. రెండవ రోజు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా… ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట‌్లన్నీ పుర్తయ్యాయి. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. విశాఖ సభా వేదిక నుంచి ప్రధాని మోదీ సుమారు.. 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

 

The liveblog has ended.
  • 12 Nov 2022 11:15 AM (IST)

    దేశాభివృద్దిలో ఏపీది ప్రధాన భూమిక-మోడీ

    దేశంలో బ్లూ ఎకానమీ ప్రాధాన్యత అంశంగా చేర్చాం. కిసాన్ క్రెడిట్ కార్డులు సులభంగా అందిస్తున్నాం. ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో మార్పులు చేస్తున్నాం. వారి జీవితం సులభతరం అవుతుంది. పేదల శక్తి పెరుగుతుందో అప్పుడే మన కల నెరవేరుతుంది. సముద్రం పూర్వకాలం నుంచి సంపద తేవడంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రేవుల అభివృద్ధి ఎంతో అవసరం. అభివృద్ధి కోసం ఇటువంటి సమగ్ర ఆలోచన కావాలి. నాకు విశ్వాసం వుంది. దేశం యొక్క వికాసంలో ప్రధాన భూమిక వహిస్తుంది.

     

  • 12 Nov 2022 11:10 AM (IST)

    పేదల సంక్షేమం మాధ్యేయం-మోడీ

    జీఎస్టీ, గతి శక్తి వంటి పాలసీల వల్ల పేదల సంక్షేమం కలుగుతోంది. భారత్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయి. అభివృద్ది యొక్క ప్రయాణంలో అనేక జిల్లాలు, వెనుకబడిన చోట కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో 6 వేలు వేస్తున్నాం. పేదలకు ఉచిత ఆహారధ్యానాలు ఇస్తున్నాం అన్నారు. డ్రోన్ల నుంచి గేమింగ్ ల వరకూ, అంతరిక్షం నుంచి స్టార్టప్ ల వరకూ అనేక పథకాలు మీ కోసం పనిచేస్తున్నాయి. యువతకు ఉపాధి లభిస్తోంది.
  • 12 Nov 2022 11:07 AM (IST)

    భారత్ సరికొత్త చరిత్ర లఖిస్తుంది-మోడీ

    అనేక ప్రాజెక్టులపై ఖర్చు తగ్గుతుంది. రవాణా వ్యవస్థలో మార్సులు వచ్చాయి. బహుముఖ రవాణా వ్యవస్థ భవిష్యత్. మీరు ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ ఆకాంక్షలు మాకు తెలుసు. భారత్ అనేక సవాళ్లను అధిగమించింది. భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసలు పొందుతోంది. ప్రపంచ ఆశల యొక్క కేంద్రబిందువుగా మారింది. భారత్ పౌరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటోంది. సామాన్య మానవుడి జీవితాన్ని మారుస్తుంది.

  • 12 Nov 2022 11:03 AM (IST)

    మౌలిక సదుపాయాల కల్పనే మా ధ్యేయం-మోడీ

    ప్రపంచంలో శ్రేష్టమయిన మౌలిక సదుపాయాల నిర్మాణం వుంది. మౌలిక సదుపాయాల కల్పనలో మా దార్శనికత కనిపిస్తోంది. రైల్వేల అభివృద్ది, రోడ్లు, పోర్టుల విషయంలో సందేహపడలేదు. మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం దేశానికి నష్టం కలిగించింది. ఎకనామిక్ కారిడార్ గురించి ఆలోచిస్తున్నాం. పోర్టుకి వెళ్లడానికి రహదారి నిర్మాణం వుంది. చేపల రేవు ఆధునీకరిస్తున్నాం.
  • 12 Nov 2022 10:58 AM (IST)

    తెలుగు వారిది ఉత్తమ ప్రతిభ, వ్యక్తితం -మోడీ

    ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులు వేస్తోంది. 10వేల పథకాల వల్ల అభివృద్ధికి బాటలు పడతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబులకు ధన్యవాదాలు తెలుపుతాను. ఏపీ వారి ప్రేమ అపురూపం. వారిద్దరూ ఏపీ గురించి ఆలోచించేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకత వుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఏపీ వారు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల్లో ఏపీకి చెందినవారు ఎంతో దూసుకుపోతున్నారు. ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు. వృత్తి పరమయిన , ఉల్లాసవంతమయిన, ఉత్తమ వ్యక్తితం వారిని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. తెలుగు భాష ఎంతో ఉన్నతమయింది. తెలుగు ప్రజలు అందరి బాగు కోసం వెతుకుతుంటారు. ఈ పథకాలు అభివృద్దికి దోహదపడతాయి.

  • 12 Nov 2022 10:53 AM (IST)

    భారత వ్యాపార కేంద్రం.. విశాఖనగరం-ప్రధాని నరేంద్ర మోడీ

    ప్రియమైన సోదరీ, సోదరులారా.. నమస్కారం.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి, అందరు మహానుభావులకు, ఏపీ ప్రజలకు అభినందనలు.. కొన్ని నెలల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలకు రావడం ఎంతో ఆనందం, భాగ్యం కలిగింది. ఇటువంటి మరో అవకాశం వచ్చింది. విశాఖపట్టణం దేశంలో ప్రముఖ నగరం. ప్రత్యేక నగరం. వ్యాపారం సమృద్ధిగా సాగే పట్టణం.. ప్రాచీన భారతంలో మంచి పోర్టు. 1000 ఏళ్ళ క్రితం వరకూ పశ్చిమాసియా రోమ్ నుంచి ఇక్కడికి వ్యాపారులు వచ్చేవారు. భారత వ్యాపార కేంద్రానికి విశాఖ కేంద్రం.

     

     

  • 12 Nov 2022 10:46 AM (IST)

    మోడీ శ్రీకారం చుట్టిన, ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే

    రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

    ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే

    ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం

    ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు

    ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన

    ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం

    ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం

  • 12 Nov 2022 10:44 AM (IST)

    ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

    శనివారం ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. విశాఖ పర్యటనలో మోడీ 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మొత్తం 10,742 కోట్ల ప్రాజెక్టులు ఏపీకి కేటాయించింది కేంద్రం.

  • 12 Nov 2022 10:39 AM (IST)

    మీ సాయం మాకు ఎంతో అవసరం-జగన్

    ఏపీలో వనరులు, బడ్జెట్ కి అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గాయాల గురించి బయటపడలేదు. ఏపీకి ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే రూపాయి బాగా ఉపయోగపడుతుంది. మీరు చేసే సాయం గుర్తుపెట్టుకుంటుంది. కేంద్రంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం ... పార్టీలకు అతీతం. మాకు మా ప్రజల సంక్షేమం తప్ప మరో అజెండా లేదు. మీరు పెద్ద మనసు చూపించాలి. దానిని మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు, పోలవరం,విశాఖ రైల్వే జోన్ వంటి వినతుల్ని సానుకూలంగా పరిశీలించాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి.

  • 12 Nov 2022 10:33 AM (IST)

    అటు సముద్రం.. ఇటు జన సముద్రం.. సీఎం జగన్

    దేశప్రగతి రథసారథి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రైల్వేమంత్రి, పలువురు నేతలకు, ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు సీఎం వైఎస్ జగన్. ఒక సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తోంది. జనకెరటం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. శ్రీకాకుళం వాసి వంగపండు ప్రసాదరావు పాడిన పాట గుర్తుకువస్తోంది. ఏం పిల్లడో ఎల్దాం వస్తావా అంటూ పాట గుర్తుచేశారు. జనం ప్రభంజనంలా కనిపిస్తున్నారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వస్తున్నాయ్... వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలు మనందరికీ కర్తవ్యబోధ చేస్తున్నాయి.

  • 12 Nov 2022 10:29 AM (IST)

    కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

    హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. సమీర్‌పూర్‌ నియోజకవర్గంలోని హమీర్‌పూర్‌లో వారు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

     

  • 12 Nov 2022 10:28 AM (IST)

    అందరికీ నమస్కారములు.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

    ప్రధాని మోడీ విజనరీ నాయకత్వంలో భారత్ పురోగతి సాధించింది. 8 ఏళ్ళలో రైల్వేల్లో పారదర్శక విధానాలు అమలుచేస్తున్నారు. సోలార్ రూట్,రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫాంలలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అమలుచేస్తున్నారు. వన్ స్టేషన్ వన ప్రొడక్ట్. విశాఖ స్టేషన్ ఆధునీకరిస్తున్నాం. టెండర్ వచ్చింది. కనస్ట్రక్షన్ ప్రారంభం కాబోతోంది. 460 కోట్లతో రైల్వేస్టేషన్ అత్యాధునికంగా మారనుంది. వందే భారత్ రైల్వే సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మోడీ ఆశీస్సులతో ఏపీకి కూడా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాబోతోంది.

  • 12 Nov 2022 10:15 AM (IST)

    సభా ప్రాంగణానికి మోడీ

    విశాఖ: విశాఖపట్నంలో ప్రధాని మోడీ బహిరంగ సభ.. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ.రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు మోడీ. రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ షీలానగర్ రహదారి నిర్మాణం..రూ. 460 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, 152 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో సహా పలు పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు.

     

  • 12 Nov 2022 10:00 AM (IST)

    ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దు

    విశాఖపట్నం లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ మద్దెలపాలెంలో  ఆందోళనకు దిగారు. దీంతో నిరసన కారులను అరెస్ట్ చేశారు పొలీసులు.

  • 12 Nov 2022 09:25 AM (IST)

    జనసంద్రంగా మారిన ఏయూ గ్రౌండ్

    ప్రధాని మోడీ సభకు పోటెత్తిన జనం..విశాఖలో రోడ్లు అన్నీ‌ జనమయం..జనసంద్రంగా మారిన ఎయు గ్రౌండ్. విశాఖ అంతటా బీజేపీ జెండాలతో కాషాయ మయంగా మారిన సాగరతీరం. భారీ బందోబస్తు ఏర్పాటు.

  • 12 Nov 2022 08:55 AM (IST)

    ప్రధాని మోడీ సభకు సీఎం జగన్

  • 12 Nov 2022 08:47 AM (IST)

    ప్రధాని ఎప్పుడు వస్తారంటే..

    ఉదయం 8 గంటలకు ప్రధానిని... గవర్నర్, సీఎం కలిశారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ముగ్గురూ హెలికాప్టర్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మందిని తరలిస్తున్నారు. 4 వేల బస్సులు, పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాట్లు చేశారు. 8 వేల 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు వీఐపీల రాకపోకలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేశారు ట్రాఫిక్ పోలీసులు.

  • 12 Nov 2022 08:46 AM (IST)

    ప్రధాని వేదికపై వారికే అవకాశం

    ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. బహిరంగ సభ వేదికపై అతిథుల కోసం 3 వేదికలు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదికపై మోడీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రమే ఆశీనులవుతారు. రెండో వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీవీఎల్, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ సహా 15 మంది బీజేపీ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. రెండువేదికలకు సమీపంలో 300 మంది కూర్చునేవిధంగా మరో వేదిక వుంది.

  • 12 Nov 2022 08:41 AM (IST)

    మోడీ సభతో మద్దిలపాలెం జనసంద్రం

    ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న మహిళలతో జన సంద్రంగా మారింది మద్దిలపాలెం జంక్షన్. మరోవైపు మోడీ పర్యటన సందర్భంగా విశాఖలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బహిరంగ సభ నేపథ్యంలో భారీ వాహనాలను సిటీలోకి అనుమతించడం లేదు. వాటిని పెందుర్తి మీదుగా శ్రీకాకుళం హైవే వైపు ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. ప్రధాని బహిరంగసభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని విశాఖ సీపీ శ్రీకాంత్ తెలిపారు. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య ఆంక్షలు అమలు కానున్నాయి.