Crackers Prices: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి కనిపిస్తోంది. దీపావళి అంటే దీపాల పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీన్నే కొందరు దివాళి అని కూడా పిలుస్తుంటారు. దీపావళి అనగానే చాలామందికి టపాకాయలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పటికీ దీపావళి సందర్భంగా టపాసులు పేల్చేవారికంటే దీపాలు వెలిగించే వారే ఎక్కువంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందంతో దీపావళి చేసుకున్నారని రామాయణం చెబుతోంది. అందుకే.. చీకటిని పారదోలి వెలుగును నింపే వేడుక దీపావళి అని చాలామంది భావిస్తుంటారు. హిందువులు చేసుకునే పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది.
Read also: Tamilisai Soundararajan: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
దీపావళి సందర్భంగా.. రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున క్రాకర్స్ షాపులు వెలిశాయి. కరోనా కారణంగా గత రెండేళ్ళలో తగ్గిన వ్యాపారం ఈసారి కాస్త బాగానే ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రజలు మాత్రం ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వాపోతున్నారు. టపాసుల ధరలు కొండెక్కడంతో వెయ్యి రూపాయలు ఖర్చు చేసినా కొద్దిగానే క్రాకర్స్ వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
* బహిరంగ ప్రదేశాల్లోనే క్రాకర్లు పేల్చండి.
* కరెంట్ స్తంభాలు, వైర్లు ఉన్న వద్ద టపాసులు పేల్చొద్దు.
* పెద్దల పర్యవేక్షిస్తూ ఉండాలి.
* క్వాలిటీ ఉన్న క్రాకర్స్ ఎంపిక చేసుకోండి. చెప్పులు లేదా షూ ధరించండి.
* క్రాకర్లను వెలిగించడానికి పొడవైన కర్రలాంటిది వాడండి.
* సమీపంలో నీరు, ఇసుక, వీలైతే మంటలను ఆర్పే పరికరం వంటివి ఉంచుకోండి.
* టపాసులు కాల్చుతున్నప్పుడు ముఖం దగ్గరగా పెట్టొద్దు..
* టపాసులు కాల్చేటప్పుడు నైలాన్ వస్త్రాలు వద్దు.. కాటన్ వస్త్రాలు ఉత్తమం.
* పొగ ఎక్కువగా వచ్చేవి డేంజర్.
* డ్రైనేజీల వద్ద టపాసులు పేల్చకూడదు.
Meena : తల్లి నిర్ణయంతో కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్