Site icon NTV Telugu

Kadapa: జిల్లా కేంద్రాన్నే మార్చేసిన పెన్నానది..

Sam (4)

Sam (4)

పెన్నా నది జిల్లా కేంద్రాన్నే మార్చేసిందంటే నమ్ముతారా.. కానీ.. ఇది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 200 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానది జీవనదిగా ఉండేది. అప్పుడు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటాన్ని రాజధానిగా చేసుకున్నారు.

సిద్ధవటం దగ్గర పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండేది. మూడు కాలాలకు సరిపడే నీరు ప్రవహిస్తూ ఉండేది. వర్షా కాలంలో పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో.. ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు తెగిపోయేవి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి.. దీంతో 1807 నుంచి 1812 వరకు ఆంగ్లేయులు ఇబ్బంది పడ్డారు. అనంతరం జిల్లా కేంద్రాన్ని పాత కడపకు మార్చారు. కడపలో ఉన్న రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఉండే భవనాల్లోకి జిల్లా కేంద్రాన్ని తరలించారు. 1952లో సిద్దవటంలోని పెన్నానదిపై లోలెవల్ కాజ్ వే ఏర్పాటు చేశారు. కానీ నది ఉదృతికి లోలెవల్ కాజ్ వే కూడా మునిగిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం జలాశయం నిర్మాణంతో సిద్ధవటంలో పెన్నానది వేసవి కాలంలో కూడా పూర్తిగా జల కళను సంతరించుకునేది.

Exit mobile version