ఏపీ అసెంబ్లీలో పెగాసస్ వ్యవహారం గందరగోళానికి కారణం అయింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని.. తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు.
ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు.
Read Also: Vidadala Rajini: జ్వరాలను రాజకీయం చేస్తున్న టీడీపీ
వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. నాలుగుసార్లు చర్చించాం. వివిధ శాఖల అధిపతుల్లో చర్చించాం. సంబంధిత అధికారులతో భేటీ అయ్యాం. 25-3-22న సభ హౌస్ కమిటీ వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకమయిన లబ్ధి జరగడానికి అవకాశం వచ్చింది. యాప్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తీసుకుని తమకు ఓటెయ్యని వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఈ డేటా చౌర్యానికి సంబంధించి మరింత మందిని విచారించాలి. మధ్యంతర నివేదికను సభ ముందుకి తెచ్చాం. చౌర్యం చేసిన వారిని పట్టుకోవాలి. నూటికి నూరుశాతం చౌర్యం చేశారని సభా సంఘం నిర్దారించింది.
Read Also: YS Vijayamma: కృష్ణంరాజు భార్యకు విజయమ్మ పరామర్శ
ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ నుంచి సేవా మిత్ర అనే యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు భూమన. నివేదిక చదివి వినిపిస్తున్న సమయంలో.. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. డిబేట్ పెట్టకుండా మీరు రూల్ ఫాలో అవుతున్నారు. కానీ టీడీపీ సభ్యులు కావాలని గందరగోళం కలిగిస్తున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి.
