NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవు

Peddireddy Occupiers

Peddireddy Occupiers

Peddireddy Ramachandra Reddy Warning To Land Occupiers: అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవని పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సర్వే ద్వారా కబ్జాదారులను గుర్తిస్తామని.. ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీ శాఖకు బదలాయిస్తామని అన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అటవీభూముల సంరక్షణపై ప్రత్యేక్ష దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 10 వేల ఎకరాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే కొనసాగుతోందని.. కబ్జాకు గురైన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అలాగే.. చిత్తూరు జిల్లాలోని ఏనుగుల సమస్యపై మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వెంటనే అదనపు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 11 బెస్ క్యాంపులు ఉన్నాయి. వాటికి అదనంగా మరో మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇటీవల ఏనుగుల బెడద పెరిగింది. బేస్ క్యాంప్ ఏర్పాటుతో ట్రాక్టర్లు పెరగనున్నాయి. బేస్ క్యాంపులు అందుబాటులోకి వస్తే.. ఏనుగుల సంచారంపై గ్రామస్తులకు తక్షణమే సమాచారం అందించడానికి వీలుంటుంది. అలాగే.. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు సత్వర చర్యలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటవీ శాఖ జిల్లాలో 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తోంది. జిల్లాలో మొత్తం 80 నుండి 90 ఏనుగులు సంచరియస్తున్నాయని సమాచారం.