NTV Telugu Site icon

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్… 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు.  ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.  తాజాగా  పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు.  ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు.  తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు.  గత ఐదు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.