Palnadu: పల్నాడు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేసి కనిపించకుండా పోయాడు. అయితే, వివరాల్లోకి వెళితే.. తన భార్యకు విడాకులు ఇచ్చిన షరీఫ్, మాచర్ల పట్టణ సమీపంలోని కొత్తపల్లి జంక్షన్‌లో నివసిస్తున్న శైలజ అనే మహిళతో గత కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం. ఈ క్రమంలో శైలజ, ఆమె భర్త కలిసి షరీఫ్ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బును కాజేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ వీడియోలో ఆరోపించాడు.
Read Also: Vizianagaram : ఎడతెరిపిలేని వానలతో రోడ్లు జలమయం..జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
అంతేకాదు, తన పట్ల ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు కూడా శైలజ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన షరీఫ్ ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపగా, కానిస్టేబుల్ షరీఫ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
