Scrub Typhus: స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్‌వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న పురుగు.. నల్లిని పోలిన చిగర్ మైట్.. కరిచినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే. ముఖ్యంగా, ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికీ సోకదు, అంటురోగం కాదని ఆయన తెలిపారు.
Read Also: Jihad Remark: ‘‘జిహాద్’’ చేయాల్సి రావచ్చు.. పార్లమెంట్ సాక్షిగా ఎస్పీ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
స్క్రబ్ టైఫస్‌కు సాధారణంగా కనిపించే లక్షణాల గురించి వివరిస్తూ.. జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి.. ఈ లక్షణాలు నాలుగు–ఐదు రోజులకు పైగా కొనసాగితే వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వ్యాధికి “డాక్సిసైక్లిన్” అనే టాబ్లెట్ వాడితే త్వరగా నయం అవుతుందని తెలిపారు.
రాజుపాలెం ఆర్ఆర్ కాలనీకి చెందిన నాగమ్మ అనే మహిళకు గత నెల 8న జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు. 14వ తేదీన గుంటూరు జీజీహెచ్ఎకు రిఫర్ చేయగా, రిపోర్టులు రాక ముందే 16న చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. రుద్రవరంకికి చెందిన జ్యోతి కూడా ఇదే లక్షణాలతో మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందారు. ఈ ఇద్దరి రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎంహెచ్‌వో వెల్లడించారు..
వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి..?
పొలం పనులకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పనిచేస్తున్న సమయంలో పురుగు కుట్టినట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు డీఎంహెచ్‌వో రవికుమార్..
