Site icon NTV Telugu

Prathipati Pullarao: నేను పవన్ కల్యాణ్‌ అభిమానిని.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా..

Prathipati Pullarao

Prathipati Pullarao

Prathipati Pullarao: చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శారదా జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక విద్యా, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో యువత కోసం కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామని, యువత కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. అలాగే, ఐఏఎస్ కృష్ణతేజ చిలకలూరిపేటలో కోట్ల రూపాయల విలువైన స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Read Also: Maoist Party: హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన పత్తిపాటి పుల్లారావు.. “నేను పవన్ కల్యాణ్‌ అభిమాని అన్నారు.. అయితే, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాన ని పేర్కొన్నారు.. మరోవైపు పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలని భావించాను, అడిగిన వెంటనే అవకాశం లభించింది అని తెలిపారు పత్తిపాటి పుల్లారావు.. ఒక, తల్లిదండ్రులు పిల్లల చదువుపై కూడా తాము మీటింగ్ ద్వారా అవగాహన పొందవచ్చని పేర్కొన్నారు.. ఈ సమావేశం ద్వారా చిలకలూరిపేటలో విద్యా రంగం, యువత అభివృద్ధి, ప్రభుత్వ చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందింది అన్నారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు..

Exit mobile version