NTV Telugu Site icon

మామయ్య మీరు త్వరగా కోలుకోవాలి : ఎన్టీఆర్‌..

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కరోనా సోకింది. దీంతో వారు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని చంద్రబాబు తెలిపారు.

దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తూ.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. మామయ్య చంద్రబాబు గారు.. నారా లోకేష్‌లు త్వరగా కోలుకోవాలని ట్విట్‌ చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి కూడా చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్‌ చేశారు.