Site icon NTV Telugu

NTR District: దారుణం.. ప్రేమ వ్యవహారం నచ్చక కూతుర్ని చంపిన తండ్రి

Ntr District

Ntr District

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో దారుణానికి తెగించాడు. ప్రేమ వ్యవహారంపై మరోసారి ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆవేశానికి గురైన తండ్రి.. ఇనుప రాడ్‌తో కొట్టడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు.

ఇది కూడా చదవండి: Midhun Reddy: నేడు రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న ఎంపీ మిథున్‌రెడ్డి

అయితే ఆగస్టు 30న మైలవరం పోలీస్ స్టేషన్‌లో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా తండ్రే చంపినట్లుగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తుండగా ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. అక్కడ నుంచి మైలవరం తీసుకొచ్చారు. కుమార్తెను చంపిన కేసులో రిమాండ్‌కు తరలించారు. గతంలో రెండో భార్యతో కలిసి గంజాయి కేసులో నిందితుడు జైలుకెళ్లి వచ్చాడు. మరోసారి నిందితుడు ఇంత ఘోరానికి ఒడిగట్టాడు.

ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య

Exit mobile version