NTV Telugu Site icon

బెజవాడ బస్టాండ్ లో రద్దీ..మాస్కులు లేకుండా బలాదూర్

అసలే ఆదివారం. సంక్రాంతికి ఊరికి వెళ్లివచ్చినవారు తమ తమ స్వలాలకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్లో తీవ్రమయిన రద్దీ ఏర్పడింది. కొంతమంది మాత్రమే కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరిగేవారికి ఆర్టీసీ వారు రూ.50 లు జరిమానాగా విధిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా శనివారం 43,763 శాంపిల్స్ ని పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2166194 కి చేరింది.