NTV Telugu Site icon

సీఎం జగన్‌తో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చింది నీతి ఆయోగ్ బృందం.. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌.. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌ బృందం పాల్గొననుండగా.. ఇవాళ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలిశారు. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్.. ప్రభుత్వ పని తీరు పై ప్రశంసలు కురిపించిన ఆయన.. సహజ వ్యవసాయం పురోగతి చాలా అద్భుతంగా ఉందని అభినందించారు.. రైతు భరోసా కేంద్రాల పనితీరు చాలా బాగుంది.. ముఖ్యమంత్రి తీసుకుని వచ్చిన అద్భుతమైన కార్యక్రమం ఇదంటూ కొనియాడారు.

Read Also: ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..

ఇక, ఉదయం ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సభ్యుల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు రాగా.. వారందరికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని నీతి ఆయోగ్ బృందానికి చేరుకున్నారు. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది.. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.