ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం వెయ్యి వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది. ఆగస్ట్ 14 వ తేదీతో నైట్‌కర్ఫ్యూ పూర్తవుతుంది. 14 తరువాత కర్ఫ్యూను పొడిగించే ఆలోచనలే ఏపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తోంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించబోతున్నారు. స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే నైట్ కర్ఫ్యూ అమలు చేయడం కుదరనిపని. ఇకవేళ పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేయడం వలన ఇబ్బందులు కూడా రావొచ్చు. నైట్ కర్ఫ్యూని ప్రణాళికా బద్ధంగా, కఠినంగా అమలు చేయడం వలన కేసులు కంట్రోల్‌లో ఉన్నాయి. కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేస్తే అనవసరమైన ప్రయాణాలు మొదలైతాయి. ఫలితంగా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. మరి ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తారా లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అన్నది తెలియాలి.
Read: కెజియఫ్ 2కి 255 కోట్ల భారీ డీల్