Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్లకు చెందిన నందినికి గుంటూరుకు చెందిన శివతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారం క్రితం డెలివరీ కోసం వినుకొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ తర్వాత నందిని పరిస్థితి సీరియస్ అవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ నందిని మృతి చెందింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో మూత్ర విసర్జన బ్లాక్ దగ్గర రంధ్రం పడడం వల్ల మృతి చెందిందని కుటుంబ సభ్యులు వినుకొండలో హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు.
Read Also: Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్
ఇక, నందిని మృతికి కారణమైన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఇరువైపులా వారికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం లోతైన విచారణ చేస్తున్నారు.
